విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు

పనిచేయని సర్పంచులపై చర్యలు తప్పవు

విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు

   వైకుంఠధామాలు పార్కుల్లా ఉండాలి 

చదువే ఏకైక ఆయుధం

వికారాబాద్ : గ్రామాభివృద్ధిలో వెనుకబడిన సర్పంచులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టర్ ట్రైని కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి దోమ మండలంలోని లోని ప్రకృతి వనం , డంపింగ్ యార్డ్ , వైకుంఠధామం, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రం తో పాటు తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాల సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపడుతుందని దీనికి గ్రామాల్లోని సర్పంచులు , అధికారులు సమిష్టిగా కలిసి అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన అన్నారు. నర్సరీలు ఎప్పుడూ మొక్కలతో పచ్చగా ఉండేలా చూడాలని తెలిపారు. వైకుంఠధామాలు వినియోగంలో ఉంటూ పార్కుల్లాగా ఉండేలా చొరవ తీసుకోవాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేసేందుకు వీలునప్పటికీ నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీరు సౌకర్యంపై ఎప్పటికప్పుడు అధికారులు ఆరాతీస్తూ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా ఇలాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఉండకుండా ఎప్పటికప్పుడు పనులు చేపట్టాలని సూచించారు. ప్రకృతి వనాలకు వాచర్లను (వన సంరక్షకులను) నియమించుకొని వారితో పని చేయించలేకపోతున్నారని కలెక్టర్ అన్నారు.

దోర్నపల్లి పంచాయతీ కార్యదర్శి , టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్

      ప్రకృతి వనం, నర్సరీ,  వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ నిర్వహణలో నిర్లక్ష్య వహించిన దోర్నపల్లి  పంచాయతీ కార్యదర్శి , టెక్నికల్ అసిస్టెంట్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్న ఎంపీఓ కు మెమో జారీ చేయనున్నట్లు  కలెక్టర్ తెలిపారు.

గ్రామాల్లో చదువే ఏకైక ఆయుధమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో భాగంగా దోర్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రంను సందర్శించారు. విద్యార్థిని విద్యార్థులతో వారు అభ్యసిస్తున్న పాటలను అడిగి తెలుసుకోవడంతోపాటు పిల్లల సామర్థ్యాన్ని బోర్డుపై రాయించి తెలుసుకున్నారు. చదువే మీకు ఏకైక ఆయుధమని, బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని కలెక్టర్ తెలిపారు. ధాత్రి అనే విద్యార్థిని పేరు అడిగి అర్థం చెప్పమనగా వెంటనే ఆ విద్యార్థిని ధాత్రి అంటే భూమి అని సమాధానం చెప్పింది. దీనికి కలెక్టర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడి, ఆశ వర్కర్ విధివిధానాలపై సూచనలు ఇచ్చారు. పాఠశాలకు సరఫరా అయిన బియ్యమును అదేవిధంగా వంటగదిని పరిశీలించారు.

 అధికారుల సమావేశానికి ముందుగా ఎంపీడీవో తాసిల్దార్ కార్యాలయాలను, రికార్డు గదిని కలెక్టర్ పరిశీలించారు.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!