పిడిఎఫ్ బలపరిచిన ,పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోతుల నాగరాజు టీచర్స్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, బుధవారం వేలాది మందితో అనంతపురం జిల్లా చలమారెడ్డి కళ్యాణ మండపంలో, నామినేషన్ల సందర్భంగా,బహిరంగ సభలు జరిగింది. అనంతపురం కడప కర్నూల్ సత్యసాయి , నంద్యాల అన్నమయ్య ఆరు జిల్లాల నుండి సిఐటియు, ఏఐటీయూసీ, యుటిఎఫ్, ఎస్ టి యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్,, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు, కెవిపిఎస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగుల, కార్మికుల,ప్రజల సమస్యల కోసం, ఉద్యమించే సంఘీభావంగా నిలబడి ఉద్యమకారులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ అధ్యక్షత వహించారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు , శాసన మండల సభ్యులు,సాబ్జీ, జల్లి విల్సన్ తదితరులు ముఖ్యవక్తులుగా పాల్గొన్నారు, అన్నమయ్య జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఏ రామంజులు, ఉపాధ్యక్షులు, చిట్వేల్ రవికుమార్, ఓబులవారిపల్లి సిఐటియు కార్యదర్శి వెంకటరమణ, కేశవులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జయరామయ్య, రైతుసంఘ నాయకులు, అంకిపల్లి చంగయ్య, కెవిపిఎస్, కార్యదర్శి నాగిపోగు పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, హరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్, రవుప్పు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపం నుండి వేలాది మందితో భారీ ర్యాలీ కలెక్టరేట్ వరకు బయలుదేరింది. మధ్యలో పోలీసులు ర్యాలీకి అనుమతులు లేవని నిలిపివేశారు. అభ్యర్థులు నామినేషన్ లో వేసి వచ్చారు.