మహానందీశ్వరుని సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
ఆలయ మర్యాదలతో స్వాగతం స్వాగతం పలికిన ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 22, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున వీరి రాకను తెలుసుకున్న అర్చకస్వాములు, ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలతో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, వారి ధర్మపత్ని రాజ్యలక్మి వార్లకు ఆలయ కార్య నిర్వహణ అధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మహానందీశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవార్ల, ప్రభాత హారతిని వారు వీక్షించారు. తదుపరి మహానందీశ్వర వారికి రుద్రాభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గోత్రనామాలు, సంకల్పముతో కుంకుమార్చన గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబానికి, ప్రెస్ అకాడమీ సెక్రెటరీ బాలగంగాధర తిలక్, రామకృష్ణ పీజీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డిలకు అర్చక స్వాములు, వేద పండితులు, వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.