సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలపండి : మాజీ మంత్రి శ్రీ.గడ్డం.ప్రసాద్ కుమార్
మంగళవారం వికారాబాద్ మున్సిపల్ లలోని మాజీ మంత్రి శ్రీ.గడ్డం ప్రసాద్ కుమార్ గారి నివాసంలో వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల.రఘుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం లో గ్రామ మరియు మండల, నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిదిగా మాజీ మంత్రి వర్యులు శ్రీ గడ్డం.ప్రసాద్ కుమార్ గారు విచ్చేసినరు ఈ సందర్బంగా వారు మాట్లాడుతు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమలను ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్క సోషల్ మీడియా నాయకుడిపైన ఉందని అదేవిదంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమలను ప్రజలకు ఎత్తి చూపే విదంగా సోషల్ మీడియా పనిచేయాలని సామాజిక మధ్యమాల్లో చురుకుగా ఉంటూ వాస్తవాలను ప్రజలకు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండ కృషి చేయాలనీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి భవిష్యత్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.