బహుజన వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై కులవివక్ష చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం:- బీఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు క్రాంతి కుమార్
(వికారాబాద్ ) రెండురోజుల క్రితం అనారోగ్య సమస్యల వల్ల మరణించిన కంటోన్మెంట్ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే జి.సాయన్న మరణించగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకుండా అవమానించడం పట్ల బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే ఇలాంటి అవమానాలు జరగడాన్ని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జి.క్రాంతికుమార్ తీవ్రంగా ఖండించారు. ఆయనకు అలా అవమానం జరగడానికి
అందుకు గల సరైన కారణాలను కూడా ప్రభుత్వం చెప్పడం లేదు.అంటే ఎమ్మెల్యే సాయన్న పేద బహుజన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టే కులవివక్షతో అవమాణించారని అర్థమవుతుంది.
గతంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రామలింగారెడ్డి,నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణించినపుడు మరియు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరణించినపుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి,ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెలుగు రాష్ట్ర ప్రజలకు సేవలందించిన సాయన్న మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
బిఆర్ఎస్ పార్టీ బహుజన వర్గాలపై చూపుతున్న వివక్షగా బిఎస్పి భావిస్తున్నది. కాబట్టి ఇలాంటి అసమానతలు,కులవివక్ష చూపడాన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం…
కులాన్ని బట్టి మనిషికి విలువ చూపించే అధికార పార్టీ, ప్రజలకు సేవ చేసిన తమ సొంత పార్టీ నాయకుడికి కులం కారణంగానే అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపలేదు అని స్పష్టంగా అర్దం అవుతుంది…
ఈ చర్యను మేం సహించే ప్రసక్తే లేదు అని ఖచ్చితంగా బీఎస్పీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు క్రాంతి కుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు…