పెట్టుబడిదారి సమాజంలో అసమానతలు ! సోషలిజం లోని సమస్యల పరిష్కారం!!
రెడ్ బుక్ స్టడీ సర్కిల్లో సిపిఎం జిల్లా నేత సిహెచ్!
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే, కమ్యూనిస్టు ప్రణాళిక పై, స్టడీ సర్కిల్ మంగళవారం ఉదయం నిర్వహించడం జరిగినది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1948 ఫిబ్రవరి 21న ప్రపంచంలో మొట్టమొదట మార్క్స్ ఎంగిల్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళికను విడుదల చేసిన రోజు అని తెలిపారు. ఆ ప్రణాళిక నేటికీ ఆచరణీయమన్నారు. వాస్తవాలు కంటికి కనిపిస్తున్నాయని తెలిపారు. పెట్టుబడే దారి సమాజం, సమస్యలు పరిష్కరించలేదని, అసమానతలు, వర్గ వైరుధ్యాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. సోషలిస్ట్ సమాజంలోనే సమస్యలు పరిష్కారం చూపుతాయని తెలిపారు. నేడు ప్రపంచంలో జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని తెలిపారు. ఉత్పత్తి సాధనాలు పెట్టుబడిదారి చేతుల్లో ఆధిపత్యం కలిగి అదికోత్పత్తి జరిగి, దారిద్రం నిరుద్యోగం పెరిగిపోతుందని, వర్గ వైరుధ్యాలు పెరిగే కొద్దీ ఆర్థిక అసమానతలు పెరుగుతాయన్నారు. 175 సంవత్సరాలు కమ్యూనిస్టు ప్రణాళిక నేటికీ ఆచరణీయమని తెలిపారు. మార్క్స్ ఏంజెల్స్ ప్రపంచానికి దిక్సూచిగా ఈ గ్రంథం రాశారన్నారు. పెట్టుబడుదారుల దోపిడీపై, కార్మికులు తిరుగుబాటు విప్లవం అనివార్యం అన్నారు. ఉత్పత్తి సాధనాలు సోషలిజంలో సమాజ పరం చేయబడతాయని తెలిపారు. తర్వాత వచ్చిన గ్రంథాలు దాస్ క్యాపిటల్, అంతర్జాతీయ సంక్షోభానికి పరిష్కారం చూపిందన్నారు. నేడు భారతదేశంలో ఆర్ఎస్ఎస్, మతోన్మాద శక్తులు, స్వదేశీ విధానమని చెప్పి, నేడు బిజెపి విదేశీ వస్తువులు దిగుమతి చేసుకొని, విదేశీ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. స్వదేశీ పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడి, నిరుద్యోగ పెరుగుతుందన్నారు. స్వదేశీ పెట్టుబడుదారులను, , అంబానీ ఆదాని, బోగస్ కంపెనీలు దేశభక్తి ముసుగు తొడిగి దోచిపెడుతుందన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక, సూత్రాలను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి లింగాల యానాదయ్య, పి జాన్ ప్రసాద్, కరతోటి హరి నారాయణ, కే వెంకటరమణ, పెంచలయ్య, జగదీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.