మహానంది ఆలయ అధికారులపై ప్రత్యేక అధికారి మండుపాటు
మీడియా ముందు మేకపోతు గాంభీర్యం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 19, మహానంది:
ప్రత్యేక అధికారిగా వచ్చిన రాణా ప్రతాప్ ఆలయ అధికారులపై మండిపడినట్లు సమాచారం. కానీ మీడియా ముందు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శించడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రత్యేక అధికారిగా వచ్చిన అధికారి మీడియా ముందు మాత్రం నేను సాధారణ భక్తునిగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నా భక్తులకు అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు కల్పించారని సాధారణంగా భక్తులతో పాటు అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనం చేశానని అంతా బాగున్నది అని మీడియాకు తెలిపారు. కానీ సాధారణ భక్తుల మాదిరి ఆలయ ప్రవేశం చేసే సమయలో మరి స్థానిక ఆలయ అధికారులు ఉండటం ఏమిటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. అన్నీ బాగున్నాయి అన్న అధికారి మరి ఆలయ అధికారులపై ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారు అనేది ప్రత్యార్థకంగా మారినట్లు తెలుస్తుంది. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి కి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మరియు పూర్తయ్యాయని మూడవ రివ్యూ సమావేశంలో పేర్కొన్నారు. మహానంది క్షేత్రంలోని ఉత్తర ద్వారం వైపు ఉన్న మాడవీధుల్లో విద్యుత్ లైట్లు కొన్ని పని చేయకపోవడం అందులో అటవీ ప్రాంతం పక్కన ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది ఈ విషయం సామాజిక మాధ్యమాలు మీడియా ముఖంగా బయటికి పొక్కడంతో అక్కడ ఏర్పాటు విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. లింగోద్భవం రోజున గాజులపల్లి వైపు ఉన్నటువంటి వాహనాల పార్కింగ్ వద్ద కొంత భాగానికి మాత్రమే విద్యుత్ సౌకర్యం కల్పించి ద్విచక్ర వాహనాలు నిలుపు స్థలాన్ని గాలికి వదిలేయడం పలు ఆరోపణలకు తావిస్తోంది. మరియు అదే ప్రాంతంలో త్రాగునీటి సౌకర్యం కల్పించకపోవడం ఏమిటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. రథశాల పక్కన ఉన్న ప్రాంతంలో కూడా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయలేదు . లింగోద్భవ కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం లో కనీస విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేదు. వీటన్నింటిపై ప్రత్యేక అధికారిని వివరణ కోరగా తాను అన్నీ చూడలేనని నేను చూసినవి బాగున్నాయని పేర్కొనడం మరి దీని అర్థం ఏమిటి అనేది ఆదికారికే తెలియాల్సి ఉంది. మరి అధికారి ఆలయానికి ప్రత్యేక అధికారిగా పరిశీలించడానికి వచ్చాడా అధికార దర్పం ప్రదర్శించడానికి. వచ్చాడా అనేది తెలియ రావడం లేదు.. చెవిటి వాని ముందు శంకు ఊదితే ఏమవుతుంది అని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.