కమ్యూనిస్టులు ఉంటే పోరాటంలో ఉంటారు.. లేదా ప్రజల కోసం పోరాడి జైల్లో ఉంటారు : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే రామస్వామి
చేవెళ్ల : కమ్యూనిస్టు నాయకులు ప్రజల కోసం పోరాడే జైల్లో అంటారు లేదా పోరాటంలో ఉంటారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె రామస్వామి తెలిపారు. చేవెళ్ల భూ పోరాటం నేటితో ఏడవ రోజుకు చేరుకున్న సందర్భంగా రామస్వామి గుడిసెల పోరాటాన్ని సందర్శించి గుడిసె వాసులతో మాట్లాడారు…పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవడం వల్లనే సిపిఐ పోరాటానికి పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పేదల తరఫున గెలిచిన దళిత ఎమ్మెల్యే అయి ఉండి పేదల తరఫున మాట్లాడకపోవడం బాధ కలిగించింది అని పేదల ఓట్లు కావాలి తప్ప వాళ్ళ కష్టాలు పట్టవా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు పట్టాలి ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలి అని అన్నారు. కమ్యూనిస్టులు ఏ పోరాటానికైనా వెనకాడరని ప్రభుత్వం గద్దె దిగివచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అధికారులు ప్రజాప్రతినిధులు కవ్వింపు చర్యలకు పూనుకోకుండా పట్టాలు ఇవ్వడానికి ప్లాన్ చేయాలని లేని పక్షంలో రాబోయే కాలంలో పోరాటం ఉదృతం చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రభు లింగం కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ మండల సిపిఐ పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి బి కే ఎన్ యు మండల కార్యదర్శి మల్లేష్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు శివ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల విజయమ్మ సాయిలమ్మ తదితరులు పాల్గొన్నారు.