కేసీఆర్ జన్మదిన సందర్భంగా వివేకానంద యజ్ఞ గురుకుల్ పాఠశాలో పండ్ల పంపిణీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని దన్నారంలో గల స్వామి వివేకానంద గురుకుల్ యజ్ఞ ఫౌండేషన్ విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పండ్ల పంపిణీ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా వర్థిలాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కమాల్ రెడ్డి వికారాబాద్ మండల్ సర్పంచుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి సర్పంచ్ రాముల నాయక్ బీసీ సెల్ అధ్యక్షులు పాండు మైనార్టీ సెల్ అధ్యక్షులు గయాస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్రవల్లి రవి వికారాబాద్ సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్ ఎస్ టి సెల్ అధ్యక్షులు మైపాల్ , భాస్కర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.