రాయవరం 2 గ్రామ సచివాలయం పరిధి హెల్త్ & వెల్ నెస్ క్లినిక్ వద్ద నిర్వహించిన నమూనా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్. అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం రెండవ గ్రామ సచివాలయం పరిధి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వద్ద నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ నందు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన బిపి ,షుగర్ , థైరాయిడ్, పక్షవాతం, గుండె జబ్బులు, ఫిట్స్ మరియు గర్భిణీ స్త్రీలను , బాలింతలను , పిల్లలను పరీక్షించి రక్త పరీక్షలు నిర్వహించి తదుపరి సూచనలు, సలహాలు అందించి మందులు అందజేసినట్లు సర్వ సిద్ది పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. వాసంతి తెలియజేశారు. పి.హెచ్.ఎన్….ఎం.రత్నాసఖి పర్యవేక్షణలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జి.కొండబాబు ,కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ పి.ఎన్.వి. యస్.ప్రసాద్ , స్థానిక సచివాలయం హెల్త్ సెక్రటరీ పి.నూకరత్నం పాల్గొన్నారని అలాగే అజాడి కా అమృత్ మహోత్చవ్ లో భాగంగా కీటక జనిత వ్యాధులపై అనగా డెంగీ, చికెన్ గున్యా,మలేరియా, ఫైలేరియా మెదడువాపు జ్వరాల పై అవగాహన కల్పించమని ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న పాత్రలు, ఫ్రిడ్జ్ వెనక తొట్టెలు, ఎయిర్ కూలర్లు, కొబ్బరి బొండాలు, టైర్లు, సిమెంట్ గోళాలు,డ్రం లు, పూల కుండీలు, పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలు, నీరు నిల్వ ఉన్న గుంతలు,రుబ్బు రోల్లు లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఇంటి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ తద్వారా పైన తెలిపిన విష జ్వరాలు బారిన పడకుండా ఉండవచ్చునని అవగాహన కల్పించి తదుపరి ఫ్రై డే..డ్రై డే నిర్వహించామని కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు.