*ఘనంగా తెలుగింటి సంప్రదాయ పద్ధతిలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు.*
ఆలమూరు మండలం జోన్నాడ గ్రామంలో రైతు భవనం(పెద్ద కళ్యాణ మండపం)నందు గురువారం కట్టా శ్రీనివాస్,నాండ్ర నాగమోహన్ రెడ్డి,తాడి ఆదిత్య రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో గ్రామంలోని 45 మంది గర్భిణీ స్త్రీలకు తెలుగింటి సాంప్రదాయ పద్ధతిలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించగా మేడపాటి శ్రీనివాసరెడ్డి(ఎమ్మెస్సార్) శ్రీదేవి దంపతులచే ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు గర్భిణులు విషయంలో పౌష్టికాహారలోపం ఉండకూడదని,పౌష్ఠికాహారం వల్ల కలిగే ప్రయోజనాలను,సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని,అలాగే ప్రభుత్వం గర్భిణీలకు ప్రత్యేక సంపూర్ణ ఆరోగ్య పోషణ కిట్లను అందజేస్తుందని,వాటిలో ఉండే పోషకాహారం ద్వారా పుట్టబోయే శిశువులు పరిపూర్ణ ఆరోగ్యవంతముగా జన్మిస్తారని,నెలలు పూర్తి అయ్యేంతవరకు తగిన జాగ్రత్తలు పాటిస్తే తల్లి,బిడ్డ క్షేమంగా ఉంటారని తెలియజేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రత్యేక సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు.అనంతరం దాతలు గ్రామ పెద్దలు సమకూర్చిన చీరలు,పూలు,గాజులు,పండ్లు,స్వీట్లు,పసుపు,కుంకుమలను ప్రతీ గర్భిణీ స్త్రీలకు అందజేసి శ్రీమంతాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి(దొరబాబు),తాడి నాగమోహన్ రెడ్డి,తాడి శ్రీనివాసరెడ్డి(మందుల షాప్ శీను),తాడి శ్యామ్ సుందర్ రెడ్డి,గొలుగూరి బుచ్చిరెడ్డి,ద్వారంపూడి ఇంద్రా రెడ్డి,గంటా మనోహర్ దాస్,తమలంపూడి లక్ష్మీనారాయణరెడ్డి,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.