వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 16, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు ధ్వజారోహణం ఉత్సవాలను వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి అర్జున శర్మ వేద మంత్రాలతో ప్రారంభించారు.ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దంపతులచే గణపతి పూజ,పుణ్యాహవాచనం, రుత్విగ్వరణ, చండీశ్వర పూజ, శివసంకల్పం, దీక్షాధారణ, అఖండ స్థాపనం,తిరుమంజన పూజలు నిర్వహించారు. ఈవో దంపతులను కంకణదారులను చేసి ఆలయంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లకు వేదపండితులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించి స్వామి వార్లను కంకణదారులను చేశారు. సాయంత్రం అంకురారోపణం,అగ్ని ప్రతిష్ఠాపన, కలశ స్థాపనం, వాస్తుపూజ, వాస్తుహోమాలు, నిర్వహించారు. ధ్వజ స్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మొదటి రోజు శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వార్లను శేషవాహనంపై పురవీదుల్లో ఊరోగించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను శేష వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి, ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, తాలూకా రూరల్ సిఐ రవీంద్ర, ఎస్సై నాగార్జున రెడ్డి,ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.