మద్యం షాపు మూసివేత
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 16, మహానంది:
మహానంది మండలంలో నీ మహానందిలో క్షేత్రంలో ఉన్నటువంటి మద్యం షాపును మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు నంద్యాల ఎక్సైజ్ సీఐ కృష్ణ కుమార్ గురువారం పేర్కొన్నారు. 17 రాత్రి నుండి 21వ తేదీ ఉదయం వరకు మహానంది క్షేత్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మద్యం దుకాణం మూసివేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని మిగతా చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలు యధావిధిగా కొనసాగన్నున్నట్లు తెలుస్తుంది.