మహానందిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం-తాహసిల్దార్ జనార్దన్ శెట్టి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 18, మహానంది:
మహానందిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి భక్తులకు సేవచేయడం అభినందనీయమని తాహసిల్దార్ జనార్దన్ శెట్టి అన్నారు.మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందిశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు కొరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు మండల గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో గరుడనంది వద్ద నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం ను తాసిల్దార్ జనార్దన్ శెట్టి ముఖ్యఅతిథిగా విచ్చేసి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ భక్తులు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, గ్యాస్త్రబుల్,నొప్పులకు తదితర వ్యాధులకు సంబంధించినవని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ అధ్యక్షుడు అమర్నాథ్, ఉపాధ్యక్షులు కమలాకర్ నాయుడు, సెక్రటరీలు మద్దిలేటి, రాంప్రసాద్, సూరి, ప్రకాష్, పాములేటి తదితరులు పాల్గొన్నారు.