రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు , అన్నమయ్య జిల్లా, రాయచోటికలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ రెవెన్యూ సహాయకుల సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కన్వీనర్ ఎస్ అల్లా బకాష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగినది. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ .చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి గారు విఆర్ఏ లకు ఇఛ్ఛిన వాగ్దానాలు మరచి పోవడం చాలా దుర్మార్గం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విఆర్ఏ లు రెవెన్యూశాఖ కు చాలా కీలకం అని పొగిడిన ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే విఆర్ఏ ల చేసిన సేవలు మరచిపోయారా అని ప్రశ్నించారు. విజయవాడలో తాము చేసి ఆందోళన పాల్గొని మద్దతి ఇచ్చి. తమ ప్రభుత్వం వస్తానే కనీస వేతన 18000 ఇస్తానని, చెప్పి మూడున్నర సంవత్సరం జరుగుతున్న, మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సిఐటియు పోరాటం చేసి సాధించుకున్న D.A.ను ఒక్కొక్క విఆర్ఏ దగ్గర నుండి 11,000/- వసూలు చేయడం చాలా దుర్మార్గం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి D.A. 300 తో కూడిన వేతనం ఇవ్వాలి.ఇఛ్ఛిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చాలి. పదివేల ఐదువందలతో కుటుంబం ఎలా బతుకుతుంది అని ప్రశ్నించారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని లేకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజనేయులు మాట్లాడుతూ, విఆర్ఏ లు ఐక్యతద్వారా మన సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు అన్నారు. సంక్షేమ పథకాలు పేరు చెబుతూ, గౌరవ వేతనంతో పనిచేసే, వీఆర్ఏలకు, సంక్షేమ పథకాలు వర్తించడం లేదని తెలిపారు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, నామినేళ్లను వీఆర్ఏలుగా గుర్తించాలన్నారు. అటెండర్, వాచ్మెన్ డ్రైవర్ ఇలాంటి కాళీ పోస్టులను వీఆర్ఏల ద్వారా బర్తి చేయాలన్నారు, జిల్లా కన్వీనర్ అల్లాబకాస్ మాట్లాడుతూ వీఆర్ఏలకు పేస్ యాప్ పెట్టడం ద్వారా, ఉన్న ఉద్యోగానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. ఇంటి స్థలం, భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ పి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ రామచంద్ర గ్రామ సేవకుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.అనంతరం కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓ సత్యనారాయణ గారికి సమస్యలతో కూడినవినతిపత్రం ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం జిల్లా కో కన్వీనర్, భోగేశ్వరయ్య, రాజంపేట డివిజన్ అధ్యక్షులు కొరముట్ల సుధాకర్. రైల్వే కోడూరు అధ్యక్షురాలు, రేవతి, లక్ష్మీకర్,రాయచోటి నరసింహులు రెడ్డి శేఖర్ , నాగేంద్ర, సంబేపల్లి రెడ్డెన్న , రెడ్డి భాష, రామేశ్వరి కుమార్, సుబ్రహ్మణ్యం, రాజంపేట నాయకులు నర్సింలు, ఓబులవారిపల్లి, మోడీ ప్రసాదు, పుల్లంపేట వెంకటసుబ్బయ్య, చిట్వేలు సుబ్బరాయుడు నందలూరు నర్సింలు, ఈశ్వరమ్మ పీలేరు ఆంజనేయులు పెదమండ్యం బుడాన్ భాష రెడ్డి రాణి చలపతి గుర్రంకొండ బాలాజి నిమ్మనపల్లి ఓబయ్య రవీంద్ర కురబలకోట రామచంద్ర నాయుడు తంబల్లపల్లి నగేష్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. 30 మండలాల నుండి పాల్గొన్నారు.