రైతులకు మూడు రోజుల శిక్షణా తరగతులు రైతు వేదికలో…వ్యవసాయ శాఖ

వికారాబాద్ మండలంలోని కొత్తగాడి క్లస్టర్ నారాయణపూర్ రైతు వేదికలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేస్తూ రైతు సమస్యలను చైతన్యంతో పరిష్కరించడానికి వికారాబాద్ జిల్లాలోని F .P.O సీఈవోస్ ,బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ,చుట్టుపక్కల గ్రామాల రైతులకు మూడు రోజుల శిక్షణా తరగతులు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సహకారంతో సుస్థిర వ్యవసాయ కేంద్రం వారు మరియు POPI నుంచి స్వచ్ఛంద సీడ్ సమస్త శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది.వ్యవసాయ విస్తరణ అధికారి జి అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఈరోజు రెండు రోజు శిక్షణ కార్యక్రమంలో నేల మరియు నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడం జరిగింది.
మితిమీరిన ఎరువులు, పురుగు మందులు వాడకంతో మన దగ్గర పండించే పండ్లు కాయగూరలు బియ్యము పాలు ఒకటేమిటి ఏ ఆహారపదార్థము ముట్టుకున్న పరిమితికి మించి రసాయనలు ఉన్నాయి ఒకవైపు ఈ రసాయనాలతో భూమి ,నీరు కలిసి తమవుతుంటే మరోవైపు మనుషుల్లో పశువుల్లో కోళ్లలో కణము కణము విషపూరితమై రోగాలు మానవాళికి పట్టిపీడిస్తున్నాయి ఈ నేపథ్యంలో రైతులు తేలికగా పశువుల పేడ ,చుట్టుపక్కల లభించే మొక్కల కషాయాలతో తక్కువ ఖర్చుతో నా నాణ్యమైన ఎరువులు పురుగు మందులు తయారు చేసుకొని అమృత తూల్యమైన ఆహారాన్ని పండించవచ్చని రైతులకు తెలియజేశారు
కింది పద్ధతులు పాటిస్తే నేల ,నీటి సంరక్షణ చేసుకోవచ్చు.

  1. వర్షాదారిత ప్రాంతాలలో నేలమరియు నీటి సంరక్షణ పద్ధతులు
  2. వ్యవసాయంలో చేదోడుకునీటి కుంటల నిర్మాణము
  3. చిన్న చెక్ డ్యామ్ లతో వర్షపు నీటి సంరక్షణ
  4. బావులలో నీటిమట్టం పెంపుకు రీఛార్జి ఫిల్టర్స్
  5. నీరు మరియు భూమి సంరక్షణలో గడ్డి మరియు ఇతర మొక్కల పెంపకం
  6. ప్రకృతి వ్యవసాయంలో పంట మరియు నేల యాజమాన్యం
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!