పర్యాటకుల భద్రతే లక్ష్యంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్- నంద్యాల జిల్లా ఎస్పీ. కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 14, మహానంది:
పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిరస్మరణీయమని నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు అన్నారు.ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగని విధంగా పర్యాటక ప్రాంతాలు మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లు లోకల్ పోలీస్ స్టేషన్ లతో అనుసంధానమై ఉంటాయని అన్నారు. ప్రతి టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లో దాదాపుగా 6 మంది సిబ్బంది షిఫ్ట్ డ్యూటీలుగా పని చేయడం జరుగుతుందని, వీరిలో సగం మంది ఆడవారు సగం మంది మగవారు పనిచేస్తారని, మహిళలకు ఎవరైనా ఆడవారు ఫిర్యాదు చేయడానికి వెళితే ఒక మహిళ ఆ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లో ఉండి వారికి భరోసా కల్పిస్తుందని ఉద్దేశంతో లేడీ కానిస్టేబుల్స్ ని నియమించడం జరిగిందని,వీరిపైన ఎస్సై స్థాయి అధికారులు గానీ ఏఎస్ఐ స్థాయి అధికారిని గాని ఉంచి పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి ప్రత్యేక టెలిఫోన్ నెంబరు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఒక వీహెచ్ ఎఫ్ సెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, ఎమర్జెన్సీ టెలిఫోన్ నంబర్స్, ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులకు భద్రత కల్పిస్తారని వారి భద్రతకు భరోసాగా ఈ పోలీస్ స్టేషన్ పనిచేస్తుందని అన్నారు. ఇది పోలీస్ శాఖలో మరో సువర్ణ అధ్యాయంగా నిలబడి పోతుంది అని అన్నారు.ఈరోజు టూరిస్ట్ పోలీస్ సేవ అనేది గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించడం జరిగిందని. ముఖ్యంగా మన నంద్యాల జిల్లాలో మహానంది,అహోబిలం శ్రీశైలం పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.అందులో భాగంగానే మహానంది పుణ్య క్షేత్రం లో మంగళవారం నాడు ప్రారంభించడం జరిగింది అన్నారు. శ్రీశైలంలో కూడా ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పర్యాటక ప్రదేశాలు మరియు ఆధ్యాత్మిక కేంద్రాలలో ప్రతిరోజు భక్తులు పర్యాటకులు ఈ ప్రదేశాలను సందర్శించడం మరియు వారాంతంలో ఎక్కువమంది సందర్శించడం జరుగుతుందని వీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండడం కొరకు వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాయని ,సుదూర ప్రాంతాల నుండి విచ్చేయు భక్తులు, సందర్శకులు, ప్రజల రక్షణ, మార్గనిర్దేశం చేస్తాయి .ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీసు విధానం ద్వారా ఈవ్ టీజింగ్ ను అరికట్టడం.దొంగతనాలు జరగకుండా చూడడం, జరిగిన వెంటనే సంఘటనపై తగిన విధంగా ఫిర్యాదు చేయుటకు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు మరియు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు, భద్రత కల్పించడం జరిగింది. అసాంఘీకకార్యకలాపాలు అడ్డుకట్ట,నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చెయ్యడం జరుగుతుంది అన్నారు.దేవాదాయ శాఖను సమన్వయము చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు తోడ్పడుతుంది.24×7 నిరంతరం నిఘా ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. సందర్శకులు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియో గించుకోవాలని సూచించారు. ఇందులో ఒక ఏఎస్ఐ మరియు ఇద్దరు పోలీసు కానిస్టేబుల్లు ఉండి 24X7 పనిచేస్తారు.ఈ కార్యక్రమంలో మహానంది ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి,పాలక మండలి ఛైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి, నంద్యాల తాలూకా రూరల్ సిఐ రవీంద్ర, మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది,ఆలయ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.