ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి -ఎంపీడీవో,తహసిల్దార్

ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి -ఎంపీడీవో,తహసిల్దార్

స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 13, మహానంది:

ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎంపీటీసీలు,జెడ్పీటీసీ సభ్యులు తెలియజేయాలని ఎంపీడీవో శివ నాగజ్యోతి, తాహసిల్దార్ జనార్దన్ శెట్టి అన్నారు.సోమవారం మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా 12 వ తేదీ నుంచి అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో శివ నాగజ్యోతి,తహసీల్దార్ జనార్దన్ శెట్టి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితాను నోటీసు బోర్డులో ఉంచినట్లు తెలిపారు.ఓటర్ల జాబితాలో ఎంపీటీసీలు,జెడ్పీటీసీ సభ్యులు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 18వ తేదీ లోపల తెలియజేయాలని వారు కోరారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!