మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన- జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 13, మహానంది:
మహానందిలో శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లను సోమవారం నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పార్కింగ్ ప్రదేశాలను, ఎద్దుల పోటీ నిర్వహించి ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లను, మరియు దేవాలయం చుట్టూ ఉన్న పరిసరాలను , రథోత్సవం నిర్వహించే ప్రదేశాలలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం శ్రీ కామేశ్వరి దేవి సహీత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వీరికి ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.స్వామి అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు నందు ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్ల గురించి తీసుకోవలసిన భద్రత చర్యల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,నంద్యాల డిఎస్పి సి .మహేశ్వర్ రెడ్డి ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దస్తగిరి బాబు ,నంద్యాల తాలూకా రూరల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర , మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.