*శాసన మండలి ఎన్నికలకు అన్ని పార్టిలు సహకరించాలి : తిరుపతి ఎన్నికల అధికారి అనుపమ అంజలి*
*తిరుపతి*
*జరగనున్న శాసన మండలి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టిలు సహకరించాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, శాసన మండలి ఎన్నికల నిర్వహణ అధికారి అనుపమ అంజలి కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం తిరుపతి నియోజక వర్గంలో శాసన మండలి ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించిన అనుపమ అంజలి మాట్లాడుతూ ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ అవుతుందని, నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 23వ తేది చివరి తేది అని, 27వ తేది వరకు నామినేషన్ల ఉప సంహరణ జరుగుతుందన్నారు. మార్చి 13 వ తేది ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందని, మార్చి 16న ఓట్లు లెక్కించి పలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు. షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో నియోజకవర్గంలో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు శాసన మండలి ఎన్నికల నిర్వహణ అధికారి, కమిషనర్ అనుపమ అంజలి ప్రకటించారు. సమావేశానికి హాజరైన వివిధ పార్టిల ప్రతినిధులు వెలిబుచ్చిన సందేహాలు, అనుమానాలపై జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెల్లడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, తిరుపతి అర్భన్ ఎమ్మార్వో వెంకటరమణలు పాల్గొన్నారు.*