అవినీతికి కేరాఫ్ అడ్రస్” గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు!

*”అవినీతికి కేరాఫ్ అడ్రస్” గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు!*

*భారత్ న్యూస్ తిరుపతి*
సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అవినీతి జలగల భరతం పట్టండి! నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్
తిరుపతి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో సూళ్లూరుపేట నగిరి కాళహస్తి పుత్తూరు లతో సహా సుమారు 18 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి!ప్రజలు తమ స్థలాలు,ఇండ్లు,ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేసినా అమ్మినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో లంచం ఇవ్వనిదే రిజిస్ట్రేషన్లు చేయడం లేదు!
తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో ఇటీవల ఏకంగా స్ట్రాంగ్ రూమ్ లో ఉండే రిజిస్ట్రేషన్ వాల్యూమ్ పుస్తకంలో నుంచి కొన్ని పేజీలు చింపేసి కొత్త పేర్లతో అంటించారని రెండు రోజుల క్రితం పత్రికలో రావడం రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో జరుగుతున్న అవినీతికి “పరాకాష్ట”సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో “ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేరు” అన్న చందంగా తయారైంది కొంతమంది అవినీతి ప్రభుత్వ అధికారులు,సిబ్బంది చేతులు కలిపి రికార్డులు తారుమారు చేశారా అన్నదానిపై ప్రభుత్వ “నిఘా” సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి!సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో బహిరంగంగా అవినీతి జరుగుతున్నా “అవినీతి నిరోధక శాఖ” అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదు!సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఎవరైనా “లంచం” అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫోన్ చేయండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫోటోతో ఏర్పాటు చేసిన స్టిక్కర్లు దర్శనమిస్తాయి అవి కేవలం కంటి తుడుపు మాత్రమే!
రాష్ట్ర ప్రభుత్వానికి భూముల రిజిస్ట్రేషన్ ల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుంది కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లిన ప్రజలకు కూర్చునే దానికి స్థలం ఉండదు,మంచినీళ్లు దొరకవు,మరుగుదొడ్లు లేవు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన మహిళలు పెద్దలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడే లేదు!సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పారదర్శకంగా భూములు కొనుగోలు చేస్తున్నా రిజిస్ట్రేషన్లకు లంచం ఇస్తే కానీ చేయడం లేదు అన్నది జగమెరిగిన సత్యం!సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొంతమంది అవినీతి అధికారులు సిబ్బంది కారణంగా ప్రభుత్వ “ప్రతిష్ట” మసకబారుతుంది అధికార పార్టీకి చెందిన నాయకులు కొంతమంది “నెల మామూళ్లు” ఆఫీసర్లను అడుగుతున్నారన్న చర్చ బహిరంగంగా జరుగుతుంది!
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన మంత్రి వెంటనే స్పందించి స్థలాల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నాను!
నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!