గిరిజనుల అభ్యున్నతే ఎస్టీ కమిషన్ దేయం
గిరిజనుల జీవనోపాధికి అడ్డొస్తే ఉపేక్షించం..రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 10, మహానంది:
గిరిజనుల అభివృద్ధికై అహర్నిశలు పాటుపడానికే ఎస్టీ కమిషన్ ఉన్నదని గిరిజనుల అభ్యున్నతికి అడ్డొస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు పేర్కొన్నారు. శుక్రవారం మహానంది సమీపంలోని చెంచులక్ష్మి గిరిజన గూడెంలో ఆయన గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు భోజన వసతులు, వసతి గదులను, తరగతి గదులను పరిశీలించే విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. చెంచుగూడెంలో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గూడ్యాన్ని గిరిజనులు సాగు చేసుకుంటున్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ పొలాలను పరిశీలించారు. అనంతరం గిరిజన గూడెం అధ్యక్షులు చలంచలం శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ చలంచలం శిరీషను సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్టీ కమిషన్ ద్వారా గిరిజనులకు అందవలసిన అన్ని పథకాలను అందజేయబడతాయన్నారు. రాజ్యాంగం ప్రకారం వారి హక్కులను అందజేయడానికి ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే 4,26,000 ఎకరాలను గిరిజనులకు సాగుభూమి కోసం అందజేయడం జరిగిందన్నారు. కొన్నిచోట్ల భూ సమస్యలు ఉన్నాయని వాటిని వేగవంతంగా పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. త్వరలోనే మిగతా కుటుంబాలకు కూడా భూ పట్టాలను అందజేయడం జరుగుతుందన్నారు. గిరిజనుల హక్కుల కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం ఎస్టీ కమిషన్ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. గిరిజన గుడాలలో ప్రజలకు ఆధార్ కార్డు లేక, పుట్టినరోజు సర్టిఫికెట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని వాటి పరిష్కారం కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. గిరిజన కాలనీలలో పక్కా ఇల్లు, దారులు, విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గిరిజనుల జీవన విధానానికి ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదన్నారు. అటవీ అధికారులు కొంత ఇబ్బందులు పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని గిరిజన కుటుంబాలను ఎవరు అడ్డుకున్న సహించేది లేదన్నారు. ఎంతటి పోరాడానికైనా సిద్ధమేనన్నారు. భూముల కొరకు ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే ప్రస్తుతం ఆర్ ఓ ఎఫ్ ఆర్ కింద భూములు వస్తున్నాయని వాటిని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. అడవిని రక్షించే ఆదివాసులకే అటవీ భూములను సాగు చేసుకునే హక్కు ఉందని శాశ్వత పట్టాలు ఇల్లు కట్టించేందుకు ఎస్టి కమిషన్ సహకారం అందిస్తుందన్నారు.గిరిజనులను వేధిస్తే చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసేందుకు వెనకాడబోమన్నారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు జారీ చేశారు. విద్యార్థులలో మరింత నైపుణ్యత పెంచాలని స్టడీ అవర్లు పెంచి విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.మొదటగా ఎస్టీ కమిషన్ చైర్మన్ మహానంది క్షేత్రంలోని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వీరిని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో వేద ఆశీర్వచనం చేయించి స్వామి వారి శేష వస్త్రము ప్రసాదములు అందజేశారు. వీరి వెంట ఎస్టీ కమిషన్ మెంబర్లు శంకర్ నాయక్, జపరంగి లిల్లీ, కుర్ర రామలక్ష్మి, మురళి, ఐటీడీఏ ప్రత్యేక అధికారి కేజీ నాయక్, మహిళా నాయకురాలు ఉసేనమ్మ, జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్, కార్యదర్శి రవికుమార్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బాలా నాయక్ తదితరులు పాల్గొన్నారు.