రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగ పిల్లలకు ఉచిత కంటి వైద్య శిబిరం
సహకరించిన ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్.ఆరిఫా భాను
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 10, మహానంది:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ మరియు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో మహానంది మండలం గోపవరంలోని సెయింట్ ఆన్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో మరియు అయ్యలూరి మెట్టలోని నవజీవన్ చెవిటి, మూగ పిల్లల పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల శుక్రవారం తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ అరిఫా భాను గారు ముఖ్యఅతిథిగా హాజరై తనదైన శైలిలో పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ కంటి వైద్య శిబిరమునకు సహకరించారు.అలాగే జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయ సూపర్డెంట్ ఆయుబ్ ఖాన్, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు యాకూబ్, మద్దిలేటి , సెయింట్ ఆన్స్ మనసిక వైద్యశాల పర్యవేక్షకురాలు సిస్టర్ రీనా జోన్స్, నవజీవన్ చెవిటి మూగ పిల్లల పాఠశాల పర్యవేక్షకులు సిస్టర్ తంగమ్, అడ్వైజర్ భాస్కరరావు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు CEC కోఆర్డినేటర్ ప్రేమసాగర్, విజన్ సెంటర్స్ కోఆర్డినేటర్ దేవయ్య, టెక్నిషిషన్స్ సాయి,సుభాహన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇలాంటి పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న రెడ్ క్రాస్ సంస్థను స్కూల్లో నిర్వాహకులు కొనియాడారు.