అబ్బిపురం గ్రామ గిరిజనలను ఐటిడిఏలో చేర్చి మౌలిక వసతులు కల్పించాలి- సిపిఐ
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 10, మహానంది:
మహానంది మండలం అబ్బిపురం గ్రామ గిరిజనులను ఐటీడీఏ లో చేర్చి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మహానంది కి వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంబా రవి బాబు కు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోటా. రాముడు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్.సామేలు,ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య నంద్యాల డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లుతెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి.మోటా రాముడు మాట్లాడుతూ. మహానంది మండలంలో అబ్బీ పురం గ్రామంలో దాదాపు 42 గిరిజన కుటుంబాలు 20 సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో పూరి గుడిసెలు వేసుకొని నివాసం చేస్తున్నారని వారికి సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళన ఫలితంగా నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ వారు నివసిస్తున్న కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించారని అన్నారు.శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి కి గడపగడప కార్యక్రమానికి ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు గిరిజన కాలనీ ని ఐటిడిఎలో చేర్చాలని విన్నవించుకోవడం జరిగిందని, ఆ కాలనీలో వీధిలైట్లు మురికి కాలువలు. రోడ్డు నిర్మాణం. మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేపట్టాలని చెప్పినా గానీ నేటి వరకు కూడా అమలు కాకపోవడం విచారకరమని అన్నారు. మహానందికి విచ్చేసిన ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిబాబు 42 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న గ్రామాన్ని సందర్శించేందుకు ఎందుకు వీలుపడలేదు అర్థం కాలేదని ఇప్పటికైనా ఆ గిరిజనులను ఆదుకునేందుకు చొరవ తీసుకోవాలని పై నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్బిపురం 42 గిరిజన కుటుంబ సభ్యులు. పిల్లాపాపలతో అందరూ పాల్గొన్నారు.