ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన- మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన- మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి

స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 09, మహానంది

మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఎరువులు మరియు పురుగు మందుల దుకాణాలను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు అనుమతులు ఉన్న ఎరువులు మరియు పురుగుమందులు మాత్రమే అమ్మాలని , అదేవిధంగా బస్తా పైన ఉన్న ఎం ఆర్ పి రేటు ప్రకారమే రైతులకు ఎరువులు అందించాలని హెచ్చరించారు. అధిక ధరలకు ఎరువులను అమ్మితే ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని,ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులను అందించాలని. అదేవిధంగా దుకాణదారులు కచ్చితంగా రైతులకు బిల్లులు ఇవ్వాలని , ధరల పట్టిక లో ప్రతిరోజు ఎరువులు మరియు పురుగు మందుల ధరల వివరాలను నమోదు చేయాలని తెలియజేసారు.

*రైతు భరోసా కేంద్రాల ద్వారా పుష్కలంగా ఎరువులు పంపిణీ*

మహానంది మండలంలో యూరియా కొరత లేదు.
మహానంది మండలంలో 100% వరి నాట్లు పూర్తి కావడం జరిగిందని, ప్రస్తుతము పిలకలు మరియు చిరు పొట్ట దశలో వరి పంట ఉన్నదని, యూరియా ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా గత రెండు నెలల నుండి పుష్కలంగా యూరియా ఎరువులను అందించడం జరిగినది. ప్రస్తుతం కూడా అందిస్తున్నామని. గత రెండు నెలల కాలంలో *యూరియా* ఎరువులను సీతారామపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 149.85 మెట్రిక్ టన్నులు ( 3330 బ్యాగ్స్), మసీదుపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 64.935 మెట్రిక్ టన్నులు( 1443 బ్యాగ్స్ ), తిమ్మాపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 49.95 మెట్రిక్ టన్నులు( 1110 బ్యాగ్స్), గోపవరం రైతు భరోసా కేంద్రం ద్వారా 89.97 మెట్రిక్ టన్నులు ( 1998 బ్యాగ్స్) , అబ్బిపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 59.94 మెట్రిక్ టన్నులు ( 1332 బ్యాగ్స్), తమ్మడపల్లి రైతు భరోసా కేంద్రం ద్వారా 119.88 మెట్రిక్ టన్నులు ( 2664 బ్యాగ్స్), గాజులపల్లి రైతు భరోసా కేంద్రం ద్వారా 19.98 మెట్రిక్ టన్నులు ( 444 బ్యాగ్స్) , బుక్కాపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 59.985 మెట్రిక్ టన్నులు ( 1333 బ్యాగ్స్), బొల్లవరం రైతు భరోసా కేంద్రం ద్వారా 104.895 మెట్రిక్ టన్నులు( 2331 బ్యాగ్స్) రైతులకు అందజేశారు.మహానంది మండలానికి గత రెండు నెలల కాలంలోనే 719.325 మెట్రిక్ టన్నులు( 15985 బ్యాగ్స్) యూరియా ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగినది. అవసరమున్న రైతు భరోసా కేంద్రాలకు ముందు ముందు కూడా పుష్కలంగా యూరియా ఎరువులను అందించడం జరుగుతుందని. రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని అన్నాను.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!