మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం
స్టూడియో 10 టీవీ న్యూస్ ఫిబ్రవరి 09 మహానంది
మహానంది పుణ్యక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ కి తాడేపల్లిగూడెం లోని వారి గృహంలో ను మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ హరి జవహర్ లాల్ కి విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళీ ఆహ్వాన పత్రికలు అందజేసారని గురువారం తెలిపారు.ఈ సందర్భంగా వారిని మహానందీశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారన్నారు. అనంతరం వేద పండితులు, అర్చకులు వేద ఆశీర్వచనాలు చేసి, స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాలను మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఎర్రమల మధు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.