*పౌష్ఠికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం.*
*అట్టహాసంగా గర్భిణులకు సీమంతాలు*
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ ఆరోగ్య పోషణ కిట్లను చిన్నారులు, బాలింతలు, గర్భిణులు సద్వినియోగం చేసుకుని రక్తహీనత నుంచి రక్షణ పొందాలని కపిలేశ్వరపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ అధికారి గజలక్ష్మి అన్నారు. ఆలమూరు లోని ఎస్టీ ఏరియా అంగన్వాడి కేంద్రంలో సూపర్ వైజర్ టీఎన్వి నాగలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో కపిలేశ్వరపురం ప్రాజెక్టు సీడీపీఓ గజలక్ష్మి, సర్పంచ్ నేలపూడి లావణ్య, ఉప సర్పంచ్ చల్లా సీతామహాలక్ష్మి, వైస్ ఎంపీపీ వాసంశెట్టి దుర్గా భవాని ముఖ్య అతిథులగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌష్ఠికాహారం వల్ల కలిగే ప్రయోజనాలను, సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను, చిన్నారులకు సకాలంలో అందించవలసిన టీకాలను వివరించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు నాతి కుమార్ రాజా, చల్లా భూషణం, వాసంశెట్టి సాయిబాబా సమ కూర్చిన చీరలు, పూలు పండ్లు, పసుపు కుంకుమలను బాలింతలకు అందజేసి సీమంతాలు నిర్వహించారు. అలాగే లబ్ధిదారులకు వైఎస్సార్ సంపూర్ణ ఆరోగ్య పోషణ కిట్లను అందజేశారు. అంగన్వాడి మహిళ కార్యదర్శి ఎస్.నీలిమ, అంగన్వాడిలు సిహెచ్ సరోజా, వి.ఆనంది, జి.సూర్యకుమారి, జి.లక్ష్మి కుమారి, ఎం.రామలక్ష్మి, డి.మణి, డి.శ్యామల, బి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.