మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన అధికారులు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 08, మహానంది:
మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి ల ఆధ్వర్యంలో బుధవారం స్వామివారి కల్యాణ మండపం నందు పూజా కార్యక్రమం నిర్వహించి పత్రికలు ఆవిష్కరించడమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుండి జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పాల్గొనే వేలాది మంది భక్తుల కోసం క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నిరంతరం ఉచితంగా స్వామివారి నిజరూప దర్శనం కల్పించుకునే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్ల ను వేల సంఖ్యలో భక్తులు దర్శించి శివ శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పాలకమండలి చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఆలయ వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.