వీఆర్ఏ లకు పేస్ యాప్ రద్దు చేయాలని14 వ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నా ను జయప్రదం చేయండి..సిఐటియు పిలుపు

వీఆర్ఏ లకు పేస్ యాప్ రద్దు చేయాలని14 వ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నా ను జయప్రదం చేయండి..సిఐటియు పిలుపు
       
  విఆర్ఎలకు రోజువారి పనికి సంబంధించిన హాజరు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు  విఆర్ఏ జీతాలకే, గాక ఉద్యోగాలకు కూడా ఎసరు పెట్టే ప్రమాదం దీనిలో దాగి ఉంది. అందుకేఈ, విధానాన్ని, వెంటనే ఉపసంహరించాలని సిఐటియు  అన్నమయ్య జిల్లా కమిటీ అధ్యక్షులు సిహెచ్.చంద్రశేఖర్. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామంజులు, ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. ఈ కొత్త    ఫేసుహాజరు విధానం ద్వారా ఎవరి సెల్ ఫోన్ లో వారే స్వయంగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశంలో నిలబడి ఫోటో తీసి ప్రభుత్వ తయారు చేసిన యాప్ ద్వారా హాజరు పంపించాలి. మన     విఆర్ఎలకు  అత్యధిక మంది అసలే చదువు రానివారు. అందులోనూ అత్యధిక మందికి సొంత స్మార్ట్ ఫోన్లు లేవు. పైగా ప్రభుత్వం నిర్ణయించిన యాప్ను డౌన్లోడ్ చేసుకొని పంపించగల అనుభవం అసలే లేనివారు. అటువంటి వారితో తమ ఫోటోలు తామే తీసుకొని హాజరు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించటం కార్మికులను వీధులపాలు చేయటమే.ప్రభుత్వం చెప్పినట్లుగా తన ఫోటో తాను తీసుకొని పంపించకపోతే తాను రోజంతా పని చేసిన వృధా కిందే లెక్క. ఎందుకంటే సక్రమంగా ఫోటో పంపకపోతే ఆ కార్మికుడికి హాజరు పడదు. హాజరు పడకపోతే జీతం కట్ అవుతుంది. వరుసగా 4 లేక 5 రోజులు హాజరు పడకపోతే పని దొంగ కింద లెక్క గట్టి ఉద్యోగం ఊడబెరికే ప్రమాదం ఉంది. ఈ కొత్త విధానం పూర్తిగా అమలయితే పండగలు, ఇతర సెలవులు కూడా అమలు కావు. విఆర్ఏ లుబానిసల్లాగా పని చేయాల్సి ఉంటుంది. ఇంతటి ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్న నూతన హాజరు విధానం (ఎ.పి.ఎఫ్.ఆర్.ఎస్) విఆర్ఎ సిబ్బంది,   ఉరితాడు లాంటిదే. ఈ విధానాన్ని తక్షణమే రద్దుచేసి  విఆర్ఎలకు,ఉద్యోగ భద్రత కల్పించల ని  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.గ్రామ రెవిన్యూ సహాయకులకు కనీస వేతనం రూ.21000/-లు ఇవ్వాలని, డిఎ తో కలిపి వేతనం చెల్లించాలని, నామినీలను విఆర్ఎలుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలి, 65 సం॥లు దాటి చనిపోయిన విఆర్ఎ కుటుంబంలో కంపాసినేట్ గ్రౌండ్ క్రింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్స్ సాధన కోసం ఫిబ్రవరి 14  తేదీ న  అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి  కలెక్టరేట్ వద్ద ధర్నా,   కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లాకమిటి ,నిర్ణయాన్ని, మీకు. తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రిగారు ఎన్నికల ముందర వీఆర్ఎలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదు. కేవలం రూ.10,500/-లతో విఆర్ ఏ కుటుంబాలు బ్రతకటం ఎంత కష్టమో ప్రభుత్వ పెద్దలకు తెలియనిది కాదు. ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా ఫలితం లేకపోవటంతో గత్యంతరం లేక ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. గత సాంప్రదాయాలకు భిన్నంగా ఇచ్చిన డిఎ ను వేతనం నుండి రికవరీ చెయ్యటం దుర్మార్గం. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతి తిరిగి రికవరీ చేయరాదని స్పష్టంగా చెప్పింది. ఇదే న్యాయం విఆర్ఎల డిఎ రికవరీ విషయంలో కూడా వర్తిస్తుంది. కావున ప్రభుత్వం తక్షణం డిఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకొని డిఎతో కూడిన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పధకాలన్ని విఆర్ఎలకు వర్తింపచెయలి. ఈ కార్యక్రమం లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!