అధ్వానంగా మారిన రోడ్డు
గుంతల మయంగా రహదారి
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు
ద్విచక్ర వాహనం బోల్తా పడి రైతులిద్దరికి గాయాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 09, మహానంది:
ద్విచక్ర వాహనం అద్భుతప్పి బోల్తా పడి రైతులు ఇద్దరికీ గాయాలైన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేస్తుంది.మహానంది మండలం మేజర్ గ్రామ పంచాయితీ గాజులపల్లి గ్రామ పరిధి బసాపురం సమీపంలోని చెరువు కట్టకు వెళ్లే రహదారి అత్యంత దుర్భరంగా తయారైంది.ఈ రహదారిలో రైతులు నిత్యం తమ పంట పొలాలకు రాకపోకలు సాగిస్తుంటారు.ఈ రోడ్డు పాడవడంతో రైతులు నడవాలంటే రైతుల అవస్థలు వర్ణనాతీతం. అంతేకాకుండా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం:- బసాపురం గ్రామానికి చెందిన రైతులు గురువారం పోలం పనుల నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం మీద వస్తున్నా సమయంలో అదుపుతప్పి కిందపడటంతో వారికి గాయాలయ్యాయని తెలిపారు.ఈ రహదారి గుండా రైతులు నిత్యం ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దారి ప్రమాదకరంగా మారి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకోవటంతో దవాఖానలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.