*జొన్నాడలో ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం.*
_అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి,శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది.ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి(దొరబాబు),గ్రామ సర్పంచ్ కట్టా శ్రీనివాస్, ఉపసర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి, తాడి మెహర్ ఆదిత్య రెడ్డి, తాడి నాగ మోహన్ రెడ్డి తదితర గ్రామ పెద్దలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి విచ్చేసి స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 14 మంది నూతనంగా ఏర్పాటుచేసిన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు.శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయానికి చైర్మన్ గా తాడి రామచంద్రారెడ్డి (చిన్న రాము), శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చైర్మన్ గా ద్వారంపూడి వెంకటరెడ్డి(గురుస్వామి) ఉండగా వారితో పాటుగా మిగిలిన సభ్యులను చిర్ల అభినందించి ఘనంగా సత్కరించారు.అనంతరం పెదపళ్ళ గ్రూప్ దేవాలయముల కార్యనిర్వహణ అధికారి పివివి.సత్యనారాయణమూర్తి,మూలస్థానం గ్రూప్ దేవాలయముల కార్యనిర్వహణ అధికారి ఎం.శివరామకృష్ణ,ఆలయ కార్యనిర్వహణ అధికారి కే.సుబ్రహ్మణ్యంలు కలిసి పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి ఆయా ఆలయాల ట్రస్టు బోర్డులలోని సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని తెలియజేశారు.అనంతరం పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివార్లకు సేవ చేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు అని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు పెద్దింటి వీర వెంకట సత్యనారాయణ,పెద్దింటి సాయికృష్ణ,కాలకూరి మల్లిబాబు,కాలకూరి లక్ష్మణరావు,గ్రామ పెద్దలు,మహిళలు,యువత,వాలంటరీలు,తదితరులు పాల్గొన్నారు._