గ్రామాలలో నెలకొన్న సమస్యలు త్వరగా పరిష్కరించాలి- మండల అధ్యక్షురాలు బుడ్డా రెడ్డి యశస్విని
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 08, మహానంది:
గ్రామాలలో నెలకొన్న సమస్యలు త్వరగా పరిష్కరించాలని మండల అధ్యక్షురాలు బుడ్డా రెడ్డి యశస్విని అన్నారు.మహానంది మండలంలోని మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం బుక్కాపురం గ్రామం నందు గల మండల మహిళ సమైక్య కార్యాలయంలో ఎంపీపీ బుడ్డా రెడ్డి యశస్విని అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని ప్రతి అధికారి ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో రైతులకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న రైతు భరోసా, పీఎం కిసాన్ మరియు సబ్సిడీ ద్వారా రైతులకు అందజేసిన వ్యవసాయ పరికరాలు తదితర వివరాలు తెలిపారు. పి.యం కిసాన్, ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని, అన్ని రైతు భరోసా కేంద్రాలలో పంట నమోదు కార్యక్రమం జరుగుతుందని, రైతులందరూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని కోరారు. జడ్పిటిసి కెవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సూర్య నందికి నూతనంగా రోడ్డు వేయడం జరిగిందని, మహాశివరాత్రి సందర్భంగా సూర్యనందికి బస్సు వేయాలని బుక్కాపురం గ్రామం దగ్గర బస్సులు ఆపడం లేదని, బస్సులు ఆపే విధంగా చూడాలని ఏపీఎస్ఆర్టీసీ వారిని కోరారు. మరియు గాజుల పల్లె , బసావపురం రైతులకు వ్యవసాయ కనెక్షన్ల కొరకు రైల్వే బ్రిడ్జి కింద కరెంటు తీసుకపోయి ఇస్తామని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలియజేయడం జరిగిందని, ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. బొల్లవరం గ్రామం ఎంపీటీసీ మాట్లాడుతూ యు. బొల్లవరం గ్రామం ముస్లిం కాలనీలో నీటి సమస్య విపరీతంగా ఉందని నీటి సమస్యను పరిష్కరించాలని మరియు గ్రామంలో చేతిపంపులు కూడా రిపేర్ చేయించాలని కోరారు. ఎంపిడిఒ శివ నాగజ్యోతి మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, గ్రామంలో దోమల బెడద లేకుండా పాకింగ్ చేయించాలని, మరియు మహాశివరాత్రి సందర్భంగా శానిటైజేషన్ చేస్తూ ఉండాలని, నంద్యాల నుండి మహానంది వరకు రోడ్లపై చెత్త వేయకుండా చూసుకోవాలని, సర్పంచులకు గ్రామ పంచాయతీ, కార్యదర్శులకు ఆదేశించారు. అనంతరం ఎంపీపీ బుడ్డా రెడ్డి యశస్విని మాట్లాడుతూ వాటర్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా క్లీన్ చేయాలని, గ్రామాలలో నెలకొన్న సమస్యలు త్వరగా పరిష్కరించాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపిడిఓ శివ నాగజ్యోతి, మండల తహసిల్దార్ జనార్దన్ శెట్టి, మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి,జడ్పిటిసి కెవి మహేశ్వర్ రెడ్డి ఎంపిటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు..