చేవెళ్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి, PACS చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి తెలిపారు.చేవెళ్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో మహా శివరాత్రని పురస్కరించుకుని ఫిబ్రవరి 18 నుంచి జరిగే జాతర ఉత్సవాలకు ఏర్పాట్ల పనులను ఈరోజు ప్రారంభించారు. చేవెళ్లలో పుష్కరిణి(గుండం) ఆవరణలో JCB మరియు లేబర్ సహాయంతో పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రపరిచారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి శ్రీపాద చార్యులు ఉప సర్పంచ్ గంగి యాదయ్య, సీనియర్ నాయకురాలు దేవర సమత వెంకట్ రెడ్డి ,మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యుల మల్ గారి మల్లారెడ్డి, నాయకులు ఆగిరెడ్డి,శ్రీకాంత్ రెడ్డి , రవీందర్ రెడ్డి,వినోద్ గౌడ్, రాములు గౌడ్ తదితరులు ఉన్నారు.