*మళ్ళీ జగనే సీఎం*
*గృహ సారథుల సమావేశంలో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి*
మళ్ళీ మళ్ళీ వై.యస్.జగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
రావులపాలెంలో పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద రావులపాలెం మండల వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ వాలంటీర్ల సమావేశం మండల బూత్ కమిటీ మేనేజర్ మరియు గ్రామ సచివాలయ కన్వీనర్లు-గృహ సారథుల కన్వీనర్ కర్రి వెంకట గోవింద కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు కొప్పన శివ, రామచంద్రాపురం నియోజకవర్గ పరిశీలకులు ఒమ్మి రఘురాం ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రేస్ పార్టీ 151 సీట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది అని, 2024 ఎన్నికలలో భారీ మెజారిటీ లక్ష్యంగా గృహ సారథులు, వై.యస్.ఆర్.కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పని చెయ్యాలని గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోను వారి వెబ్సైట్ నుండి తొలగించుకున్నాయని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన రోజు నుండే అమలు చేసుకుంటూ వచ్చారని గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇచ్చిన హామీలతో, ఇవ్వని హామీలు కూడా 95 శాతం అమలుచేసి చూపించారని, గత ప్రభుత్వంలో ఉన్న రెండు మూడు పధకాలు కూడా పార్టీ కండువా కప్పుకుంటేనే అందించేవారని, ఇప్పుడు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, పార్టీలు ఏమి చూడకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా అందరికీ అందించడం జరుగుతుంది అని అన్నారు.
కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా మన నాయకుడు చేసిన మంచిని ప్రజలకు వివరించి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.