మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం-ఆర్డీవో శ్రీనివాస్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 07, మహానంది:
మహానంది పుణ్య క్షేత్రంలో పిబ్రవరి 16వ తేదీన జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండవ కోఆర్డినేషన్ మీటింగ్ క్షేత్రంలోని పోచా బ్రహ్మానంద రెడ్డి విశ్రాంతిభవనం నందు మంగళవారం ఆర్డీవో ఏ .శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలను అన్ని ప్రభుత్వ శాఖ ల అధికారుల సమన్వయం తో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విజయవంతం చేస్తాం అన్నారు. ఆలయ ఈవో కాపు చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవం లకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం ప్రత్యేక దర్శన క్యూలైన్ లు ఏర్పాటు చేసి,క్యూలైన్ లలో త్రాగునీరు మరియు మజ్జిగ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అన్నారు.దర్శనం అనంతరం భక్తులకు అన్ని సామాజిక సంఘాల సమన్వయంతో అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అన్నారు.క్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తుల కోసం జాగరణ సమయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు క్షేత్రం నకు వచ్చే భక్తుల కు ఎటువంటి అవరోధాలు జరగకుండా ప్రత్యేక పోలీసు యంత్రాంగం,ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా,అల్లరి మూకల ఆగడాలు నివారించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.వైద్య అధికారి చంద్ర శేఖర్ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాల కు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.అనంతరం మహానంది క్షేత్రంలో నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ పూజలు నిర్వహించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి, శేష వస్త్రాలతో సత్కరించి, వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల తాలూకా రూరల్ సిఐ రవీంద్ర, మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి, ఆలయ ఈఏఈఓ ఎర్రమల మధు, తదితరులు పాల్గొన్నారు.