వాహనాల వేలాల ద్వారా రూ.4.12 లక్షల ఆదాయం

వాహనాల వేలాల ద్వారా రూ.4.12 లక్షల ఆదాయం

స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 07, మహానంది:

మహానంది పోలీస్ స్టేషన్లో నిర్వహించిన వాహనాల వేలాల ద్వారా రూ.4.12 లక్షల ఆదాయం వచ్చినట్లు ఎస్ఐ నాగార్జున రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒకటిప్పర్,బొలెరో వాహనాన్ని మహానంది సమీపంలో వదిలిపెట్టి పోగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, సంబంధిత వాహన యజమానులు ఎవరైనా ధ్రువపత్రాలను తీసుకొని వచ్చి చూపించాలని, వారికి వాహనాలు అప్పగిస్తామని, పత్రికా ప్రకటనల ద్వారా యజమానులకు తెలియజేసినా, స్పందన లేక పోవడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.ఈ వేలం పాట ద్వారా రూ. 4.12 నాలుగు లక్షల పన్నేండు వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఎస్సై వివరించారు.ఈ కార్యక్రమంలో మహానంది డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి, మహానంది పోలీస్ సిబ్బంది, వేలం పఠాదారులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!