ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్:బీఎస్పీ

💥ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్:బీఎస్పీ

ఇటిక్యాల:ప్రజలకు ఆశాజనకం లేని బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బహుజన సమాజ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జీ.మణికుమార్ అన్నారు. సోమవారం ఆయన ఇటీక్యాల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీకి 1,463 కోట్లు, వైద్య రంగానికి 12,161 కోట్ల నిధులను కేటాయించడం ఎంతవరకు సమంజసం అన్నారు. అదేవిధంగా బీసీ ,ఎస్టీ సంక్షేమంకు తక్కువ బడ్జెట్ కేటాయించాలని అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. అదేవిధంగా మహిళా వర్సిటీల కొరకు చాలా తక్కువ మొత్తంలో (100 కోట్లు) కేటాయించి మహిళా యూనివర్సిటీల ప్రాధాన్యతను తగ్గించడం జరిగిందన్నారు. పరిశ్రమల కొరకు కేవలం 4000 కోట్ల నిధులు కేటాయించాలని.. ఇది నిరుపేద ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్ అని ఆయన మండిపడ్డారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి ఉపేందర్, ఆకేపోగు రాంబాబు, బీసన్నలు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!