సీడు పత్తి రైతుల సమస్యలపై జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం:బుచ్చి బాబు
👆నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్
గద్వాల : గద్వాల జిల్లాలో అత్యధికంగా విత్తనపత్తిని సాగు చేస్తున్నటువంటి రైతులు అనేక రకాలుగా అన్యాయానికి గురవుతున్నారని, కంపెనీలకు మధ్యవర్తులకి మధ్య ఉన్న ఆర్గనైజర్ల వల్ల రైతులు నలిగిపోతున్నారని అందుకే వీరి సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుటకై ఎల్లుండి బుధవారం నాడు ఉదయం 10:30 గంటలకు పాత బస్టాండ్ చౌరస్తానందు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని దీనికి రైతులు పెద్ద ఎత్తున హాజరుకావాలని బుచ్చిబాబు విజ్ఞప్తి చేశారు.ప్యాకెట్ పై ధరను పెంచాలని, ఫెయిల్ అయిన విత్తన పత్తికి 2020 సంవత్సరం నుంచి రిశాంపిల్ నిర్వహించాలని, పంటను చేతికిచ్చిన మూడు నెలల లోపు రైతులకు పేమెంటు చేయాలని మరియు రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లవన్న, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు,మల్దకల్ మండల ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, మీసాల కిష్టన్న,శివన్న తదితరులు పాల్గొన్నారు.