ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ కే. సృజన
ఫిర్యాదుదారులతో ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఎస్పీ
గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పురస్కరించాలని గద్వాల జిల్లా ఎస్పీ కే.సృజన అధికారుల ఆదేశించారు. సోమవారం గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో పలు ఫిర్యాదులను గద్వాల జిల్లా ఎస్పీ సృజన నేరుగా ఫిర్యాదుదారులతో ఫిర్యాదులను స్వీకరించారు. సివిల్ వివాదాలు ఉంటే కోర్టులో పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కారం చేస్తామని అన్నారు.