బిజెపి రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
మండల పునర్విభజనలో ఫరూఖ్ నగర్ మండలానికి అన్యాయం
బిజెపి రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
బీజేపీ పార్టీ ఫరూఖ్ నగర్ మండల కార్యవర్గ సమావేశం
షాద్ నగర్ నియోజకవర్గం మండలాల పునర్విభజనలో ఫరూక్ నగర్ మండలానికి తీవ్ర అన్యాయం జరిగిందని బిజెపి రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ ఫరూఖ్ నగర్ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు డి. వెంకటేష్ అధ్యక్షతన స్థానిక బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నియోజక వర్గ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, యువమోర్చా రాష్ట్ర నాయకులు వంశీకృష్ణ, ఎస్సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎంకనోళ్ళ వెంకటేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇసునాతి శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు బీమయ్య, విట్యాల నర్సింహలు పాల్గొన్నారు.
నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజకవర్గంలో పెద్ద మండలమైన ఫరూఖ్ నగర్ మండలాన్ని మండల పునర్విభజనలో భాగంగా పురాతన మొగిలిగిద్దను కానీ మారుమూల చించొడ్ ను గాని ఎందుకు మండలకేంద్రంగా చేయలేదని ప్రశ్నించారు.
ఫరూఖ్ నగర్ మండలంలో ఏ ఒక్క గ్రామానికి సరిగ్గా రోడ్లు లేవని ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవని దళితులకు భూములు లేవని చదువుకున్నోలకు ఉద్యోగాలు లేవని రైతులు అమ్ముకోగా మిగిలిన పొలాల్లో పంటలు పండించుకొనేందుకు సాగునీటి సౌకర్యం లేదని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ మండలానికి ఎం అభివృద్ధి చేశారో స్థానిక ప్రజా ప్రతినిధులు చెబుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రము ఏర్పాటై కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చ లేదని, కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనకు తగిన గుణపాఠం చెపుతారని విమర్శలు చేశారు. ఈ నియోజకవర్గంలోనే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ఒక్కరూపాయి ఖర్చుపెట్టని కేసీఆర్ కేంద్రంతో నీటివాటాల గురించి కొట్లాడుతడంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఆంద్రకు వ్యతిరేకంగా కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణా నీళ్లు మళ్ళీ ఆంధ్రోల్లే తీసుకు పోతుంటే మాట్లాడని కేసీఆర్ ప్రాజెక్టుల రిడిజైన్ పేరుతో మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి తెలంగాణా సొమ్ము దోచిపెడుతూ తను దోచుకుంటున్నారని పేర్కోన్నారు. ఈ సందర్బంగా కిషన్ నగర్ గ్రామానికి చెందిన పలువురు నరేంద్రమోదీ పైన నమ్మకంతో బీజేపీ పార్టీలో చేరినట్టుప్రకటించారు. బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీ లోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పోలింగ్ బూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లు బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు..