వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తాం..!
హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
కొత్తూరు మండలం సిద్ధాపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర..
రెండూ వేల మంది కార్యకర్తలు, అభిమానులతో సాగిన యాత్ర
తెలంగాణ ప్రజల అభివృద్ది, సంక్షేమం కోసం చేయి చేయి కలిపి వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గం కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామం నుంచి సోమవారం ఆయన హాత్ సే హాత్ జోడో యాత్రను ఘనంగా ప్రారంభించారు.
అంతకు ముందు దేవాలయంలో ప్రత్యెక పూజలు నిర్వహించారు. యాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నిర్విరామంగా చేపట్టిన భారత్ జూడో యాత్ర స్ఫూర్తిగా తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. వివిధ గ్రామాల నుంచి రెండు వేల మంది సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పాదయాత్ర సందర్భంగా ప్రతి చోట ఆగుతూ ప్రజల సమస్యలను వింటూ ముందుకు సాగారు రైతులను కర్షకులను కార్మికులను ప్రజలను మహిళలను కలుసుకొని వారి వినతులను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ప్రజల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలని, తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, ఎస్ బి పల్లి సర్పంచ్ అంబటి ప్రభాకర్, గూడూరు మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్, మన్నె దేవేందర్ నందిగామ మండల అధ్యక్షుడు జంగా నరసింహ, దేపల్లి కుమార్ గౌడ్, అశోక్, చిలకమర్తి నరసింహ, తీగాపూర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు..