“ఆశా” డే సమీక్షా సమావేశం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో “ఆశా” డే సమీక్ష సమావేశం డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డాక్టర్ స్రవంతి ఆశా సిబ్బందితో మాట్లాడుతూ.. కంటి వెలుగు జరుగుతున్న గ్రామాలలో, ఆశాలు ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి కంటి వెలుగు ప్రోగ్రాం గురించి వివరించి, 18 సంవత్సరములు నిండిన వారందరినీ కూడా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి, వారి యొక్క కంటి పరీక్షలు చేయించాలని సూచించారు. అలాగే గర్భవతులను మూడు నెలల్లో వారిని రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. ప్రతి గర్భవతి రిజిస్ట్రేషన్ మిస్ కాకుండా చూడాలని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వారికి రక్త పరీక్ష చేయించి, వారికి టి.టి ఇంజక్షన్ ఇప్పించి, రక్తము తక్కువ ఉన్నవారికి ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇప్పించాలని చెప్పారు. ప్రతి గర్భవతికి మూడవ చెకప్ మరియు నాల్గవ చెకప్ షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ తో పరీక్ష చేయించాలని చెప్పారు. గర్భవతి రిజిస్ట్రేషన్ మరియు వ్యాక్సినేషన్ అన్ని కూడా ఆన్లైన్ అప్డేట్ చేయించాలని తెలియజేశారు. అలాగే టి.బి సస్పెక్టెడ్ కేసెస్ వాళ్ళందరిని కూడా గల్ల పరీక్ష చేయించి, టీబి వ్యాధి నివారణకు తోడ్పడాలని సూచించారు. ప్రతి బుధవారము మరియు శనివారాలలో సంవత్సరంలోని పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ తప్పకుండా ఇప్పించి, వాటిని వెంటనే ఆన్లైన్ అప్డేట్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ గారు, హెల్త్ ఎడ్యుకేటర్ జై శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ చంద్రకళ, ఫార్మసిస్టు ఉదయ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ రాజు, స్టాఫ్ నర్స్ స్వప్న, ఏఎన్ఎంలు మరియు ఆశలు పాల్గొన్నారు..