హాజిపల్లి కంటి వెలుగు సందర్శించిన జిల్లా మాస్ ఐడి ఆఫీసర్ పి. నరహరి
షాద్ నగర్ డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియాలో హాజిపల్లిలో గ్రామములో నడుస్తున్న కంటి వెలుగు ప్రోగ్రామును జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ పి నరహరి సందర్శించారు. ప్రజల యొక్క స్పందన గురించి డాక్టర్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఏఎన్ఎంలకు మరియు ఆశాలకు గ్రామంలో ఇంటింటికి తిరిగి 18 సంవత్సరములు నిండిన వారందరినీ కూడా కంటి వెలుగు ప్రోగ్రాంకు తీసుకురావాలని తెలిపారు. ఎవరికైతే దగ్గర చూపు ఉన్న వారందరికీ కూడా కంటి అద్దాలు అందజేయాలని తెలియజేశారు. దగ్గర చూపు మరియు దూరుచూపు ఉన్నవారికి రిఫ్లెక్షన్ గ్లాసెస్ కు రాసి పంపాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి, అత్తమాలజిస్ట్ తుకారం, డీ.ఈ.వో భారతి, అశ్విని, ఏఎన్ఎం వెంకటమ్మ , మరియు ఆశలు పాల్గొన్నారు.