మహానంది ఆలయానికి 63.83 లక్షల ఆదాయం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 02, మహానంది:
మహానంది ఆలయానికి గురువారం నిర్వహించిన వివిధ టెండర్లలో 63 లక్షల 83 వేల రూపాయలు గత ఏడాది కంటే అధికంగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ ఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.కొన్ని టెండర్లు వాయిదా పడినట్లు తెలిపారు. రెండు కోట్ల 61 లక్షల 66 వేల రూపాయలు వివిధ టెండర్ల ద్వారా ఈ ఏడాది వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, ఏఈఓ మధు, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, పాలకమండలి సభ్యులు జి మల్లికార్జున వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.