జగనన్న కాలనీ లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి
ఎంపీడీవో శివ నాగజ్యోతి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 02, మహానంది:
జగనన్న కాలనీ లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో శివ నాగజ్యోతి తెలిపారు.గురువారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని 1 వ సచివాలయంలో జగనన్న కాలనీల నిర్మాణాల మీద సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో శివ నాగజ్యోతి మాట్లాడుతూ జగనన్న లబ్ధిదారులు త్వరగా ఇళ్ళు నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు చేయూత అందిస్తుందని,ఈరోజు మీరు నిర్మించే ఇళ్ళు తరతరాలుగా మీ పిల్లలకు భవిష్యత్ అని, సచివాలయ సిబ్బంది సైతం లబ్ధిదారులకు అందుబాటులో ఉండాలని, ఇంటి నిర్మాణంలో వారికి ఎటువంటి సందేహలు, సలహాలు, సహాయం కావాలి అన్న తోడుగా ఉండాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలని, ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వాసుదేవుడు, వీఆర్వోలు వెంకటరాముడు, చంద్రమోహన్, పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్ ఇర్ఫాన్, శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పాల్గొన్నారు.