జిల్లాలు దాటి పింఛన్లు పంపిణీ చేసిన వాలంటీర్లు
వలస కూలీల వద్దకే పింఛన్లు పంపిణీ
వాలంటీర్ల సేవలు అభినందనీయం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 01, మహానంది:
మహానంది మండల వ్యాప్తంగా వైఎస్సార్ భరోసా పెన్షన్ కానుకను వేకువజామున నుంచే గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.బుధవారం బసాపురం గ్రామంలోని నక్క లక్ష్మీదేవి, నల్లబోతుల లింగమ్మ, కడుగు రంగమ్మ లకుపింఛన్లు పంపిణీ చేయడానికి వెళ్లగా అక్కడ వారు లేరని గుంటూరు జిల్లా వినుకొండ 23 కిలోమీటర్ల సమీపంలో కూలి పనుల నిమిత్తం వలస వెళ్లారని తెలుసుకొని వారి వద్దకే వెళ్ళి వాలంటీర్లు ఎన్.మధు,మానికింది సాలు ఈశ్వరయ్య లు ఫించన్లు అందజేశారు.ఈ సందర్భంగా పెన్షన్ దారులు మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలు హర్ష నీయమని, వారికి ఎంతో మేలు చేస్తున్నాయని, ఆనందం వ్యక్తం చేసి, తమ కొరకు ఎన్నో ప్రయాసలు పడి ఇంత దూరం వచ్చి తమకు పింఛన్ అందించిన వాలంటీర్ల గొప్ప మనస్తత్వానికి అభినందనలు తెలియజేశారు.
Super మా వార్డు సచివాలయం అడ్మిన్ ఖాజా సార్ కూడా మా అమ్మ ebc నేస్తం పథకం కి అప్లై చేస్తే మా అమ్మ కడప జిల్లా ముద్దునూరు మండలం కొత్త పల్లి విలేజ్ లో ఉంది సార్ అని చెప్తే నంద్యాల నుండి కొత్తపల్లి కి వెళ్లి మరీ ఆధార్ అనుసంధానం చేసుకొని ఫోటో గ్రాఫ్ తీసుకొని వచ్చాడు. సీఎం గారు తెచ్చిన వాలేటిర్ వ్యవస్థ ప్రజలకు బాగా చేరువ అయ్యింది అనడానికి ఇవే ఉదాహరణలు.