ఆలమూరు కాపు కల్యాణ మండప నిర్మాణానికి ధాతలు రూ.3 లక్షల రూపాయల విరాళం.
శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనులకు తగిన సహాయం అందిస్తామని ప్రభుత్వ విప్ చిర్ల హామీ
డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం ఆలమూరు గ్రామంలో స్థానిక భువనేశ్వరి చెరువు వద్ద నిర్మిస్తున్న కాపు కల్యాణ మండప నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త , జాతీయ అవార్డ్ గ్రహీత ,వైఎస్సార్ పార్టీ సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,మండల కాపు సంఘం అధ్యక్షులు, పిఠాపురం నియోజక వర్గ పరిశీలికులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు ,మరియు శ్రీ కృష్ణ దేవరయలు కమిటి ఆధ్వర్యం లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు శ్రీ కృషణదేవరాయలు కాపు కల్యాణ మండపం నిర్మాణ పనులకు 3 లక్షల రూపాయిల విరాళం అందచేశారు.శ్రీ కృష్ణ దేవరాయుల కాపు సంఘం అధ్యక్షులు,ఆలమూరు మాజి ఉపసర్పంచ్ ,పి ఎ సి ఎస్ మెంబర్ చల్లా సత్యనారాయణ (నానాజీ )లక్ష రూపయులు, ఆలమూరు ఉపసర్పంచ్ చల్లా లక్ష్మి భూషణం (బుజ్జిబాబు)లక్ష రూపాయిలు, డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు తండ్రీ క్రి శే చల్లా రామంజనేయులు జ్ఞాపకార్థం , ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ చల్లా మునిస్వరమ్మ లక్ష రూపాయిల ఆర్థికసాయం శ్రీ కృషణదేవరాయలు కాపు సంఘం కమిటీ గౌరవ అధ్యక్షులు రామానుజులు శేషగిరరావుకు , మండల కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు కు అందచేశారు .ఈ సందర్బంగా డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ కొత్తపేట నియోజక వర్గ శాసన సభ్యులు , ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి కల్యాణ మండపం నిర్మాణ పనులకు ప్రభుత్వం నుండి కూడా ఆర్థిక సహాయం అందించడానికి హామీ ఇచ్చారు అని చల్లా తెలియచేశారు . ఇటివల కాలములో తమ వంతుగా 5 లక్షల రూపాయిల అందచేశను అని , అవసరం అయితే అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియచేశారు.నిర్మాణ పనులకు ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందజేసిన ప్రతి కాపు సోదరులకు కృతజ్ఞతలు తెలియచేశారు. భావి తరాలకు, అన్ని వర్గాల ప్రజలకు ,కులమతాలకు అతీతంగా అందరికీ ఉపయోగ పడేల ఈ కాపు కల్యాణ మండపం నిర్మిస్తున్నాము అని తెలియచేసారు. ఈ కార్య క్రమంలో శ్రీ కృష్ణ దేవరాయల కాపు సంఘం అధ్యక్షుల చల్లా నానాజీ, గౌరవ అధ్యక్షులు రామానుజుల శేషగిరరావు, సెక్రటరీ ఎలుగుబంట్లు సాయి, ట్రేజరర్ సిరిగినిడి పట్టాభి,చల్లా సూర్యారావు, ఉపాద్యక్షులు శ్రీపతి సూర్యనారాయణ, గంటా వీర్రాజు, చల్లా ఉదయం, తాకసి దుర్గ,తిరణం ఉమ,వెంపల సత్తిబాబు,చల్లా వేంకటేశ్వర రావు, శ్రీపతి వీరవేణి, ఐతిరెడ్డి సురేష్,మరియు కమిటీ సభ్యులు,పెద్దలు పాల్గొన్నారు.