క్షేత్రస్థాయిలో పంట నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేసిన- మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 01, మహానంది:
మహానంది మండల పరిధిలోని మసీదుపురం, సీతారామపురం, గోపవరం గ్రామాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు చేస్తున్నటువంటి పంట నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కొంతమంది రైతుల పొలాలను సందర్శించి వారి పంటలను సంబంధిత రైతు భరోసా కేంద్రాల సిబ్బంది తప్పులు లేకుండా నమోదు చేస్తున్నారా లేదా అనే విషయం గురించి రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి రైతు రబీలో వేసిన పంటలను వెంటనే పంట నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా పంట నమోదు చేయించుకున్న వారు వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఈ కేవైసీ (EKYC) చేయించుకోవాలని తెలియజేశారు. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పంట నష్టపరిహారం గాని , పంట బీమా గాని వర్తిస్తుందని, తమ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవడానికి అర్హులు అవుతారు అని తెలియజేయడం జరిగినది. రైతు భరోసా కేంద్ర సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి రైతులు వేసిన ప్రతి పంటను తప్పులు లేకుండా ఆన్లైన్లో పంట నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి .నాగేశ్వర రెడ్డి, రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి ప్రభావతమ్మ హ, గ్రామ రెవిన్యూ అధికారులు సంజీవరెడ్డి , నరసింహులు, గ్రామ వ్యవసాయ సహాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, లక్ష్మీకాంత్ , హరిత రైతులు పాల్గొన్నారు.