ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో ఐటీడీ ఆధ్వర్యంలో బోర్లు
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 30, మహానంది:
మహానంది సమీపంలోని తెలుగు గంగ కాలువను అనుకొని ఉన్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సాగు నీటి కోసం బోర్లు సోమవారం వేస్తున్నారు. దాదాపు 60 ఎకరాల్లో గిరి పుత్రులకు గత కొన్ని నెలల క్రితం అటవీ ప్రాంతంలో సాగు భూమిని కేటాయించారు. కొంతమందికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. సాగుకు అనుకూలంగా ఉండే విధంగా భూమిని చదును చేసి అందులో వివిధ రకాల పండ్ల తోటలను పెంచి గిరిజనులకు అప్పగించేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. మహానంది లో గిరిజనులతో స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి మరియు ఒక సంస్థ ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి గిరిజన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే సాగుకు అనుకూలంగా భూమి తయారు చేయించి బోర్లు వేసి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో బోర్లు వేయడానికి అడ్డుకుంటున్నారని దాంతో ఐటీడీఏ పీవో మరియు మహానంది మండల తాసిల్దార్ కార్యాలయ అధికారు ల ఆధ్వర్యంలో రెవెన్యూ మరియు ఐ టి డి ఏ సహకారంతో బోర్లు వేస్తున్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు లోబడే బోర్లు వేస్తున్నామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికే రెండు బోర్లు వేయగా నీళ్లు పడకపోవడంతో పాటు వేసిన బోరు వేసినట్టే పూడికతో పూడి పోతున్నట్లు సమాచారం.