పౌర హక్కుల పై అవగాహన సదస్సు
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 30, మహానంది:
మహానంది మండలం మహానంది గ్రామ పంచాయతీలో నీ ఈశ్వర్ నగర్ యందు పౌరహక్కుల పై అవగాహన సదస్సును మండల తాహసిల్దార్ జనార్ధన్ శెట్టి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిర్మూలించబడింది అన్నారు.. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని పిల్లలను చదివించుకోవాలని అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందన్నారు. కుల మత తర్వాత మా బేధం లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగం చెబుతున్న విషయాలను అందరూ అవగాహతం చేసుకోవాలన్నారు.. ప్రభుత్వాలు అనగారిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని వాటిని వినియోగించుకోవాలని తమ వంతు పూర్తి సహాయ సహకారాలు వారికి ఉంటాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో శివ నాగజ్యోతి, పి ఆర్ ఏ రాముడు, మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి, ఏపీవో శ్రీను, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు మమతా రెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.